తెలుగు భాషా దినోత్సవం
“అమ్మ” అనే మాట లోని అమృతం తెలుగు
—-----------------------‐—-----------------------
తెలంగాణా మట్టిలో గట్టి దనాన్ని చాటి , ప్రాంతాలకు, ప్రాంతీయతకు మధ్య వారధిలా ,అమృత సారధిలా ,తన వారిని తరాల వరకు, మరవని మెరుపై మెదనిలా,పుడమి గొప్పదనాన్ని చాటే రోజు సెప్టెంబర్ 9,2025.శ్రీ కాళోజీ నారాయణరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని, మాతృభాష తెలుగు కొత్త దనాన్ని సంతరించుకుని ,చిన్నారుల గళాల నుంచికోయిలలై కూసి,చిలుకలై పలికి “వికాస్ ది కాన్సెప్ట్ స్కూల్” సభా ప్రాంగణాన్ని పరవ శింపజేసింది.చిన్నారుల ప్రాచీన సాహిత్య అవధాన ప్రక్రియకు సరి కొత్త శ్రీకారం చుట్టింది. పరవళ్ళు తొక్కే పాటల ,నృత్యాలతో తెలుగు భాషా దినోత్సవం శ్రావణ మేఘాలై కదిలి చిన్నారులను ఆనంద బిందువులతో అలరింప జేసింది.